రష్యాలోని పరిశోధనా కేంద్రంలో కలకలం: ఉద్యోగి మృతితో తీవ్ర ఆందోళన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Mosco

రష్యాలోని ఇర్కుత్స్క్ యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ల్యాబ్ ప్రమాదంలో డరియా షిపిలోవా అనే ఇరవై ఎనిమిదేళ్ల ఉద్యోగిని అనుమానాస్పద రీతిలో మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఆమె తీవ్రమైన అజ్ఞాత జాడ్యంతో ప్రాణాలు కోల్పోగా, ప్లేగ్ వ్యాధి సోకిందనే వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనపై అమెరికా సహా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు తీవ్రంగా స్పందిస్తూ, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు రష్యన్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.