మురసు తుపాను ముప్పు: యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

మురసు తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ నుంచి అధికారులతో ఆయన తుపాను సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తగిన నీటి నిర్వహణతో రిజర్వాయర్లను నింపాలని సీఎం స్పష్టం చేశారు.