గెల్లి రాజలింగు సేవలు అభినందనీయం: విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రశంసలు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్, హమాలీ సంఘం అధ్యక్షుడు గెల్లి రాజలింగును సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సింగరేణిలో సుదీర్ఘకాలం పాటు ఎలాంటి రిమార్కులు లేకుండా సీనియర్ మైనింగ్ సర్దార్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన రాజలింగు, ప్రస్తుతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని సంఘం నాయకులు అభినందించారు.