తీవ్ర వాయుగుండం ప్రభావంపై అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

బంగాళాఖానంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహాలు, సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదులతో పాటు ప్రధాన బ్యారేజీల వద్ద నీటిమట్టాలపై ఆరా తీశారు. రిజర్వాయర్లు, చెరువులను నింపాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.