హనుమంత వాహనంపై కోదండరామునిగా భక్తులకు దర్శనమిచ్చిన మలయప్పస్వామి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుమల
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామి వారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనసేవ వైభవంగా సాగగా, అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.