బెంగళూరులో కత్తులతో దుండగుల వీరంగం నలుగురికి గాయాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: బెంగళూరు

కర్ణాటక రాజధాని బెంగళూరులో భయానక ఘటన చోటుచేసుకుంది. ఉత్తరహళ్లి మెయిన్ రోడ్డులోని మారమ్మ సర్కిల్ సమీపంలో మూడు మోటార్ సైకిళ్లపై వచ్చిన ఆరుగురు ముసుగుధారులు దారిన పోయే వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కిరణ్ ఎన్, ఆయన స్నేహితుడు అలాగే మరోచోట రాజు, రవి అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.