బొప్పరాజుపాలెంలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన పసుపుదళం
రిపోర్టర్: MC KISHORE
స్థలం: నారాయణవనం
నారాయణవనం మండలం కసింమిట్ట ఎంపీటీసీ సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి కరీంబేడు సుధా, జెడ్పీటీసి అభ్యర్థి పి గిరిబాబులకు మద్దతుగా బొప్పరాజుపాలెం పంచాయతీలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్ భాస్కరన్ నేతృత్వంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు రమేష్ కోనేటి బాబుతో పాటు పలువురు నాయకులు పాల్గొని తెలుగుదేశం పార్టీ విజయానికి శ్రమించాలని పిలుపునిచ్చారు.