ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: కాంగ్రెస్, ఆప్ నేతలపై సీఎం రేఖా గుప్తా మండిపాటు
రిపోర్టర్: గోపి
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు యత్నించిన కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారుల ఆందోళన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి నిరాశను ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. రాజకీయ లబ్ధికోసమే అశాంతి సృష్టిస్తున్నారని మండిపడుతూ, సామాన్యుల ఇబ్బందులకు వారే కారణమని స్పష్టం చేశారు.