చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు.. నిజం గెలిచింది కార్యక్రమానికి లోకేశ్‌ పిలుపు

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

చంద్రబాబు అక్రమ అరెస్టుకు బుధవారంతో మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్ నారా లోకేశ్‌ ప్రకటించారు. బూత్ స్థాయిలో 53 దీపాలు వెలిగించి ఈ రోజును బ్లాక్‌ డేగా పాటించాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరిగిన తెదేపా లీడర్‌షిప్ కాంక్లేవ్ ముగింపు సభలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.