శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం: క్లాస్రూమ్లో విద్యార్థినిపై రంపంతో దాడి

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీసత్యసాయి జిల్లా

శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాలిక కుడిచేయి తెగిపోగా, పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.