నెల్లూరులో రౌడీషీటర్ ప్రదీప్పై కత్తితో గొంతు కోసి హత్యాయత్నం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నవాబుపేటలో రౌడీషీటర్ మర్లపాటి ప్రదీప్పై సాయి, సునీల్ అనే అన్నదమ్ములు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కుసుమ హరిజనవాడలో గొడవ అనంతరం ఆటోలో వెళ్తున్న ప్రదీప్ కళ్లల్లో కారం చల్లి, కత్తితో గొంతు కోసి నిందితులు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పాత కక్షలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించి గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.