గుంజపడుగులో భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలని సర్పంచ్ పిలుపు

రిపోర్టర్: Subhan.Manthani స్థలం: మంథని

మంథని మండలం గుంజపడుగు గ్రామంలో కాసిపేట శివారు భూముల రీ సర్వేపై గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ మాట్లాడుతూ రైతులు పట్టా పాస్ పుస్తకాలు, సరిహద్దుల వివరాలతో సర్వేలో పాల్గొని సహకరించాలని కోరారు. రికార్డులను క్షేత్రస్థాయిలో సరిచూసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.