గుండ్లబావిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి గ్రామంలో నూతన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్లు ఉబ్బు వెంకటయ్య, ఈడుదుల మస్తాన్ బాబు యాదవ్ ఘనంగా ప్రారంభించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకే తీసుకువచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.