మృత్యువులా మారుతున్న పలాస ప్రధాన రహదారులపై ఆవుల సంచారం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రోడ్లపై ఆవులు విచ్చలవిడిగా సంచరిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రద్దీ ప్రాంతాల్లోనూ ఆవులు రోడ్డుపైనే తిష్టవేయడంతో నిత్యం ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆవులను తప్పించుకునే క్రమంలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆవులు గుంపులుగా ఉండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.