పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను బాధితురాలికి అందజేసిన విశాఖ పోలీసులు
రిపోర్టర్: గోపి
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీకి చెందిన కనక అను మహిళ కంచరపాలెం బజారులో తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. వెంటనే ఆమె కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దీనిపై తక్షణమే స్పందించిన పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు ద్వారా ఫోన్ను కనిపెట్టారు. బాధితురాలికి ఫోన్ అప్పగించడంతో ఆమె నగర సీపీకి, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అని VizagCityPolice వెల్లడించారు. ప్రజా రక్షణలో విశాఖ పోలీస్ యంత్రాగం ఎప్పుడూ ముందుంటుందని అధికారులు పేర్కొన్నారు.