హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై కానిస్టేబుల్ దాడి

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అమానుషంగా దాడి చేశాడు. మహిళను కొడుతూ, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా వీధిలో మహిళ పట్ల అత్యంత హేమంగా ప్రవర్తించడంపై ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.