టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ బాల్య పోరాటంపై ఆసక్తికర కథనం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Belgrade
నోవాక్ జకోవిచ్ పన్నెండేళ్ల వయసులో యుద్ధ వాతావరణం మధ్య టెన్నిస్ శిక్షణ పొందినట్లు క్రీడా నిపుణులు వెల్లడించారు. సెర్బియాపై నాటో దాడులు జరుగుతున్న సమయంలో నీరు లేని ఈత కొలనులో ఆయన ప్రాక్టీస్ చేశారని పేర్కొన్నారు. కోచ్ జెలెనా గెన్సిచ్ చొరవతో జర్మనీ అకాడమీకి వెళ్లిన ఆయన, ఇటువల ఇరవై నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి చరిత్ర సృష్టించారని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడాలనే తత్వమే తనను అగ్రస్థానంలో నిలిపిందని తెలిపారు.