ఆదిలాబాద్ పసిపిల్లల మృతిపై కేసీఆర్ సర్కార్ తీరుపై కవిత ఫైర్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో ఐదు మంది పసి పిల్లలు మృతి చెందితే ముఖ్యమంత్రికి వచ్చి చూసేందుకు తీరిక లేదా అని ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో నిలదీశారు. దత్తత తీసుకున్న జిల్లాలో పిల్లలు చనిపోతే పట్టించుకోరా అని మండిపడ్డారు. ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు సమయం ఉంటుందని, కానీ మైనార్టీ, ఆదివాసీ పిల్లల మరణాలపై స్పందించే సమయం లేదా అని ముఖ్యమంత్రిని ఘాటుగా ప్రశ్నించారు.