వర్షంలోనూ తడుస్తూ బ్యాంక్ ఉద్యోగుల నిరసన గర్జన

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాసకాశీబుగ్గ జంట పట్టణాల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని నాయకులు స్పష్టం చేశారు. వారానికి ఐదు రోజులు మాత్రమే పనిదినాలుగా ప్రకటించాలని, వేతనాల నిర్ణయంలో యూనియన్తో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలాస నుంచి కాశీబుగ్గ వరకు వర్షంలో తడుస్తూ ఉద్యోగులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు బ్యాంక్ సంఘం నాయకులు పాల్గొన్నారు.