సీసీటీవీ నిఘా కోసమని మామను హత్య చేయించిన కోడలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో సీసీటీవీ నిఘాపై కోపంతో వ్యాపారి వినీత్ మనోచాను కోడలు శాలు హత్య చేయించింది. ఇంట్లో స్వేచ్ఛలేకుండా చేస్తున్నాడనే కక్షతో మాజీ పనిమనిషి గౌతమ్, అతని స్నేహితుడితో కలిసి పథకం పన్నింది. కుటుంబంతో బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు వినీత్‌ను కత్తితో పొడిచి చంపారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కోడలు సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.