నిరుద్యోగులకు అలర్ట్: త్వరలో పీఎస్ఎస్ఎస్బీ క్లర్క్ రాత పరీక్ష ఫలితాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: పంజాబ్

పంజాబ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నిర్వహించిన క్లర్క్ రాత పరీక్ష ఫలితాలు త్వరలో వెలువడనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. గతేడాది అక్టోబర్ పదకొన జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ ముగిసింది. తుది కీ ఖరారు చేసిన అనంతరం అధికారిక వెబ్సైట్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.