అక్టోబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ప్రకటించిన ఆర్బీఐ
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు పలు సెలవులు రానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. జాతీయ మరియు ప్రాంతీయ పండుగల కారణంగా వివిధ తేదీల్లో బ్యాంక్ శాఖలు మూతపడనున్నాయి. ముఖ్యంగా గాంధీ జజయంతి తో పాటు దసరా, దుర్గా పూజ ఉత్సవాల వేళ రాష్ట్రాలు, నగరాల వారీగా ప్రత్యేక సెలవులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. బ్యాంకు లావాదేవీలు నిర్వహించే వినియోగదారులు ముందస్తుగా సెలవుల జాబితాను పరిశీలించాలని ఆర్బీఐ సూచించింది.