ఇండ్లు కట్టుకున్నా పట్టా స్థలాల పేరుతో వేధిస్తున్నారంటూ బాధితుల ఆవేదన

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చల్లూరు గ్రామంలో ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నప్పటికీ, కొందరు పట్టా స్థలం పేరుతో తమను బెదిరిస్తున్నారని బాధితులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లలోని రికార్డులను పరిశీలించి తక్షణమే న్యాయం చేయాలని, లేనిచో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.