ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను కాపాడాలంటూ ప్రధానికి మంత్రి తుమ్మల లేఖ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం
దేశ వంట నూనెల విధానానికి ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలే కేంద్రబిందువుగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిపిఓ దిగుమతి సుంకం తగ్గింపును తక్షణమే సమీక్షించి, రక్షణాత్మక దిగుమతి సుంక విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ప్రధానమంత్రికి, సంబంధిత కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. తెలంగాణలో వేలాది మంది రైతులు లక్షలాది హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని లేఖలో స్పష్టం చేశారు.