అరకు కాఫీతోనే తన దినచర్య మొదలవుతుందన్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా తన దినచర్య అరకు కాఫీతోనే మొదలవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. పచ్చని గిరిజన కొండల ప్రాంతాల నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియుల కప్పుల్లోకి చేరిందని ఆయన పేర్కొన్నారు. అరకును అంతర్జాతీయ స్థాయి కాఫీ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. స్థానిక గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం ముందుకెళ్తోందని చంద్రబాబు తెలిపారు.