ఒంగోలులో ఘనంగా 150 ఉచిత మెగా వైద్య శిబిరాలు

రిపోర్టర్: హరి స్థలం: ప్రకాశం

ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంతో పాటు కొత్తపట్నం మండలంలో 150 ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇస్లాంపేటలో ఈ శిబిరాలను ప్రారంభించారు. ప్రైవేటు ఆసుపత్రుల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాల్లో మొత్తం 22,139 మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.