సహకార సంఘం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గంప వెంకటేష్ గుప్తా పిలుపు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. సంఘం చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులకు అందిస్తున్న పంట రుణాలు, ఎరువుల పంపిణీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించి లబ్ది పొందాలని ఆయన తెలిపారు.