పింఛన్ల దరఖాస్తులపై వృద్ధులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కొత్త దరఖాస్తుల కోసం వృద్ధులు, దివ్యాంగులు కార్యాలయాల వద్ద పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల నమోదు బాధ్యతను యానిమేటర్లు, గ్రామ సంఘం పదాధికారులకు అప్పగించింది. రాలేకపోతే వారి వద్దకే వెళ్లి వివరాలు సేకరించాలని సెర్ప్‌ సీఈవో వాకాటి కరుణ స్పష్టం చేశారు. కార్యాలయాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.