మానసిక ఆరోగ్యం అత్యవసరం: ఒత్తిడిని జయించే మార్గాలపై డీఎంహెచ్ఓ పిలుపు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఖమ్మం డీఎంహెచ్ఓ డాక్టర్ డి. రామారావు సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ఐడీఓసీ కార్యాలయంలో ప్రతిజ్ఞ నిర్వహించారు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, వ్యాయామం అలవర్చుకోవాలన్నారు. టెలి-మానస్ నంబర్ ద్వారా ఉచిత కౌన్సెలింగ్ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.