మిగిలిన మద్యం దుకాణాల లాటరీకి ఎక్సైజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన ఎనిమిది వందల ఏడు మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ అధికారులు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం మూడు వేల ఏ వందల ముప్పై ఆరు షాపుల్లో ఇప్పటికే రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది షాపుల రెన్యూవల్ పూర్తయింది. ఆసక్తి గల వ్యాపారులు అక్టోబర్ ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అక్టోబర్ ఐదున లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.