'రూ. 30 లక్షలకు పైగా రికార్డు ధర': మార్కాపురంలో ఘనంగా గణేష్ లడ్డూ వేలం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: మార్కాపురం
మార్కాపురం జిల్లా సీఎస్ పురం మండలం అయ్యాలూరివారిపల్లె గ్రామంలో వినాయక చవితి నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాటలో భక్తులు పోటాపోటీగా పాల్గొనగా, స్థానిక భక్తుడు ముత్యాల సుబ్బారెడ్డి రూ.30,01,116 భారీ ధరకు లడ్డూను దక్కించుకున్నారు. అలాగే పూజా కలశాన్ని పాలగుళ్ల నారాయణరెడ్డి రూ.21,01,116 వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఇరు వేలాలు సరికొత్త రికార్డులు సృష్టించడంతో వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.