మనుబోలులో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న బస్సు, డ్రైవర్ మృతి

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం గురివిందపూడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావెల్ బస్సు, ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక మహిళకు తీవ్ర గాయాలు కాగా, మరో 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నెల్లూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.