మంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తానని విజయవాడలో భారీ మోసం

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయవాడ

విజయవాడ కేంద్రంగా మంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి ఓ వ్యక్తి వద్ద లక్షలాది రూపాయలు కాజేసిన ఘటన కలకలం రేపింది. గుంటూరుకు చెందిన బాధితుడిని వంశీ అనే వ్యక్తి ప్రత్యేక పూజలతో డబ్బు పెంచుతానని నమ్మించి మోసం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.