ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా నూతన జిల్లా కార్యవర్గ నియామకం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా పిఆర్టియు కార్యవర్గంలో జన్నారం మండల ఉపాధ్యాయులకు సముచిత స్థానం లభించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో జన్నారం నుంచి జిల్లా ఉపాధ్యక్షులుగా గాజుల చంద్రశేఖర్, వామన్ కుమార్ అలాగే కార్యదర్శులుగా జాజాల శ్రీనివాస్, కే సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తమ నియామకానికి సహకరించిన మండల అధ్యక్షులు కట్ట రాజమౌళి, ప్రధాన కార్యదర్శి అనుముల రాజన్నలకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.