ట్రాన్స్ఫార్మర్ల చోరీల గుట్టురట్టు: నలుగురు నిందితులు అరెస్ట్ తో రాగి వైరు స్వాధీనం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Kalyandurg
కళ్యాణదుర్గం డివిజన్లో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేసి వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారని రూరల్ సీఐ నీలకంఠేశ్వర్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు నాలుగు వందల కిలోల రాగి వైరును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రైతుల ఫిర్యాదుల మేరకు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టి ఈ దొంగల ఆట కట్టించినట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.