అమెరికా ఎన్నికలు: బహిరంగ సభలను రద్దు చేసుకున్న డొనాల్డ్ ట్రంప్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Washington

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రిపబ్లికన్ నేషనల్ కమిటీ వెల్లడించింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నప్పటికీ కాన్సాస్, అయోవా రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన తన బహిరంగ సభలను ట్రంప్ రద్దు చేసుకున్నారు. ఆ సభల స్థానంలో దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ఫోన్ కాల్స్ ద్వారా టెలిఫోన్ ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేయాలని ఆయన నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.