మృత్యు కుహరం నుండి మూగజీవాలను కాపాడిన రెస్క్యూ సిబ్బంది
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు రెండు నక్కలు పడిపోయాయి. బావిలో నుంచి వింత శబ్దాలు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన చేరుకున్న ప్రత్యేక రెస్క్యూ బృందం తాడు, బోను సహాయంతో బావిలోకి దిగింది. సుమారు ఐదు గంటల పాటు తీవ్రంగా శ్రమించి అర్ధరాత్రి వేళ ఆ ఆడ, మగ నక్కలను సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడి అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టారు. అధికారుల చొరవను గ్రామస్థులు అభినందించారు.