రూ.25 కోట్ల ఆస్తి కోసమే ఏఈ కుటుంబంపై అఘాయిత్యం: సాధిక్ ఖాన్

రిపోర్టర్: సతీష్ స్థలం: కాకినాడ

కాకినాడలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. రూ.25 కోట్ల ఆస్తి కోసమే తాను హత్యకు పాల్పడినట్లు ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. సైనైడ్ ప్రయోగించి అల్లుడిని హతమార్చినట్లు, వేధింపుల వల్లే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.