అమెరికా ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ఫీజులను భారీగా పెంచిన ప్రభుత్వం
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమెరికా
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలనుకునే విదేశీ పెట్టుబడిదారులకు భారీ షాక్ తగిలింది. ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ దరఖాస్తు ఫీజులను గణనీయంగా పెంచుతున్నట్లు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో భారతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది.