చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించిన స్టార్ క్వార్టర్ బ్యాక్ మహోమ్స్
రిపోర్టర్: మహేష్
స్థలం: World
అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ పాట్రిక్ మహోమ్స్ 'మేక్-ఎ-విష్' ఫౌండేషన్‌తో కలిసి అనారోగ్యంతో బాధపడుతున్న టైలర్, స్టాక్ అనే ఇద్దరు చిన్నారులను కలిసి ఆశ్చర్యపరిచారు. కన్సాస్ సిటీ చీఫ్స్ జట్టుకు వీరభిమానులైన ఈ చిన్నారులతో మహోమ్స్ సరదాగా గడిపి, బహుమతులు అందజేశారు. ఈ మానవీయ కోణాన్ని చూసి అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క్రీడాకారుడి గొప్ప మనసుపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.