మత్స్యకార కుటుంబాలకు యాభై కేజీల ఉచిత బియ్యం అందజేత
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు మరియు వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సముద్రం అలజడిగా ఉండటంతో వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు తక్షణ సహాయంగా యాభై కేజీల ఉచిత బియ్యాన్ని అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాల కారణంగా జీవనోపాధి కోల్పోయిన తీరప్రాంత కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.