ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ప్రొఫెసర్‌కు మద్దతు తెలిపిన ఫ్యాకల్టీ ఫోరం
రిపోర్టర్: మహేష్
స్థలం: మహారాష్ట్ర
ఐఐటీ బాంబేలో విద్యార్థి సాహిిల్ వాకోడే ఆత్మహత్య ఘటనలో వివాదంలో చిక్కుకున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ డూల్లాకు సంస్థ ఫ్యాకల్టీ ఫోరం అండగా నిలిచింది. పరీక్షలో మాల్ ప్రాక్టీస్ ను రిపోర్ట్ చేసినందుకే ప్రొఫెసర్‌ను అకారణంగా టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఫ్యాకల్టీ ఫోరం చీఫ్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ పంత్ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు చేస్తున్న కుల వివక్ష ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.