ఖర్గే వ్యాఖ్యలపై డి.కె. అరుణ తీవ్ర ఆగ్రహం: కాంగ్రెస్ నైతిక దిగజారిన వైనం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మహబూబ్ నగర్
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ పార్టీ నైతిక దిగజారుడుతనానికి నిదర్శనమని మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం ద్వారా సాధారణ భారతీయులను, రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. వారసత్వ రాజకీయాల సింహాసనాన్ని ప్రజలు కూలదోశారన్న అక్కసుతోనే కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.