మరణానంతరం అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రసాద్ పట్నాయక్

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా అయ్యన్నపేట జంక్షన్కు చెందిన మదర్ తెరిసా సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు త్యాడ ప్రసాద్ పట్నాయక్ మంగళవారం జీవన్దాన్ వెబ్సైట్లో అవయవదానం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనుకోకుండా బ్రెయిన్ డెత్ జరిగితే తన అవయవాలు నలుగురికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడికి కిడ్నీ సమస్య ఎదురుకావడంతో గతంలో భార్య కిడ్నీ దానం చేశారని, అవయవాల విలువ తెలిసే తాను ఈ అడుగు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.