అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించి పదిహేను భవనాలు నేలమట్టం చేసిన అధికారులు
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో తనిఖీలు చేపట్టి, ఒక్కో జోన్లో ఐదు చొప్పున మొత్తం పదిహేను అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. మరో ఎనిమిది నిర్మాణాలకు నోటీసులు జారీ చేయగా, ఒక భవనాన్ని సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.