వర్షంలోనూ జోరుగా సాగిన టీడీపీ అభ్యర్థి రవికుమార్ ఇంటింటి ప్రచారం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇరవై ఏడో వార్డులో కూటమి బలపర్చిన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రావాడ రవికుమార్ జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ ఓటర్లను అభ్యర్థించారు.