పాలకుల నిర్లక్ష్యపు హామీలతో నిలిచిపోయిన రైతన్న విద్యుత్ సరఫరా

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హుస్నాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతులకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు సద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున రెడ్డి ఆరోపించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి కనీసం 10 గంటలు కూడా ఇవ్వడం లేదని తీవ్రంగా విమర్శించారు. ఇస్తున్న విద్యుత్ సరఫరాలో నాణ్యత లేకపోవడం వల్ల మోటార్లు కాలిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.