ఢిల్లీ యూనివర్సిటీలో కలకలం: ప్రొఫెసర్ సంగీత్ కుమార్ రాగి ఆఫీస్ ధ్వంసం

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

టీవీ డిబేట్ లో కుల దూషణల వివాదం నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సంగీత్ కుమార్ రాగి కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేశారని వర్సిటీ అధికారులు తెలిపారు. నార్త్ క్యాంపస్ లోని సోషల్ సైన్సెస్ భవనంలో ఉన్న ఆయన గది తలుపు అద్దాలు పగులగొట్టి, ఫర్నిచర్ ను పాడుచేశారని, గేటుకు పేడ పూశారని వెల్లడించారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టాయి.