తెలంగాణ జిల్లాల ఏర్పాటు చారిత్రక దినమంటూ కేసీఆర్ను కొనియాడిన హరీష్ రావు
రిపోర్టర్: రాజేష్
స్థలం: సిద్దిపేట
తెలంగాణ రాష్ట్ర అవతరణతో పాటు జిల్లాల ఏర్పాటు కలను సాకారం చేసిన చారిత్రక రోజు నేడని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడించారు. ఆత్మగౌరవ పోరాటాన్ని సుసాధ్యం చేసి, ప్రజల ఏండ్ల కలలను నిజం చేసిన ఘనత గులాబీ అధినేత కేసీఆర్కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 11 జిల్లాల అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సాధన ప్రస్థానాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన మరోసారి ఘనంగా గుర్తుచేసుకున్నారు.