జర్నలిస్టు వర్కాల కృష్ణయ్య మాతృమూర్తి చిన్నమ్మ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

జర్నలిస్టు వర్కాల కృష్ణయ్య తల్లి చిన్నమ్మ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య హైదరాబాద్ అంబర్పేటలోని ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంబర్పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.